మెగాస్టార్ సినిమాలో హ హ హాసిని..!

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఇప్పటికే త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు హా హా హాసిని అని అంటున్నారు. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ప్రేక్షకులను మెప్పించిన జెనిలియా రితేష్ దేశ్ ముఖ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.   

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనిలియా మళ్లీ సినిమాల్లోకి రావాలని చూస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో జెనిలియా నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ వచ్చినట్టే. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లిన జెనిలియా రీ ఎంట్రీతో ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.