
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా అది సంచలనంగా మారుతుంది. ఇక లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో 8 సాంగ్స్ ఉంటాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుద్ధాల అశోక్ తేజ ఇప్పటికే 3 సాంగ్స్ రాసి ఇచ్చారట.
అల్లూరిగా రాం చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్న ఈ సినిమాలో దేశభక్తికి సంబందించే సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది. అయితే సాంగ్ కౌంట్ 8 అనేది అఫిషియల్ కాదు. కేవలం తెలుగు ఆడియెన్స్ కోసమే అలా 8 సాంగ్స్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రతి అప్డేట్ సినిమా రేంజ్ పెంచుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.