
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ అందించిన మ్యూజిక్ లో రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
సామజవరగమన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే 7 కోట్ల వ్యూస్ తో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియో ఇంత పెద్ద హిట్ అవగా వీడియో కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ ప్యారిస్ లో చిత్రీకరిస్తున్నారు. సామజవరగమన ఆన్ ది వే అంటూ అల్లు అర్జున్ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ లో బన్ని స్టెప్పులు, కాస్టూంస్ కూడా అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మహేష్ సినిమా కంటే ఎక్కువ బజ్ క్రియేట్ చేసుకుంది.