దర్బార్ కు మహేష్ ప్రమోషన్

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పాన్ ఇండియా డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో రజినికాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబందించిన మోషన్ పోస్టర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ తో పంచుకోవడం సంతోషంగా ఉందని.. మీపై ప్రేమ, గౌరం ఎప్పటికి ఉంటాయని.. మురుగదాస్ సర్, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మహేష్.

ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. రజినికాంత్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. మురుగదాస్ మార్క్ కంటెంట్ తో.. రజిని ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు.