భీష్మ ఫస్ట్ లుక్ టీజర్.. జోడీ అదిరింది..!

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ చేశారు. రష్మిక నడుము అందాలను ఆస్వాదిస్తూ నితిన్ కనిపించిన తీరు చూస్తుంటే భీష్మ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. నితిన్, రష్మిక జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ చేస్తున్న సినిమా భీష్మ ఈ సినిమతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

ఇక ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది రష్మిక. ఇప్పటికే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సుకుమార్ కాంబో సినిమాలు చేస్తున్న రష్మిక భీష్మతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. ఛలో తో హిట్ అందుకున్న వెంకీ ఈ సినిమాతో ఆ రిజల్ట్ రిపీట్ చేసేలా చూస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.