రాం చరణ్ చేశాడు కాబట్టే..!

యువ హీరోల్లో విలక్షణమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు. ఈ ఇయర్ ఆల్రెడీ బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా తిప్పరామీసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కృష్ణ విజయ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ విష్ణు పాత్ర టిపికల్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలిపాడు శ్రీవిష్ణు.   

తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారిందని.. రానున్న రోజుల్లో మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ వస్తాయని అంటున్నాడు శ్రీవిష్ణు. రంగస్థలం కాన్సెప్ట్ మూవీ పిచ్చి పిచ్చిగా ఆడింది. అయితే రాం చరణ్ లాంటి పెద్ద హీరో చేశాడు కాబట్టి అది అందరికి రీచ్ అయ్యింది. కొత్త వాళ్లు, నా లాంటి వాళ్లు చేస్తే బి, సి సెంటర్స్ కు తీసుకెళ్లడం కష్టం అవుతుందని అన్నాడు శ్రీవిష్ణు.