
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమా నుండి రిలీజైన సాంగ్ సూపర్ హిట్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది.
రవితేజ కథల విషయంలో ఈమధ్య చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ రిజెక్టెడ్ స్టోరీపై రవితేజ మనసు పడ్డాడని తెలుస్తుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన స్టోరీ నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వెంకటేష్ చేయాల్సి ఉంది. కాని ఎందుకో ఆ సినిమాను పక్కన పెట్టేశాడు వెంకటేష్. ఇప్పుడు అదే కథతో రవితేజ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. రవితేజ కెరియర్ లో సూపర్ హిట్ అయిన భద్ర, రాజా ది గ్రేట్ సినిమాలు ఒక హీరో కాదంటేనే తన దగ్గరకు వచ్చాయి. భద్ర సినిమా అల్లు అర్జున్ కాదని రవితేజ దగ్గరకు పంపించాడు. రాజా ది గ్రేట్ రామ్ చేయాలని అనుకోగా కుదరక రవితేజతో చేసి హిట్టు కొట్టాడు. మరి వెంకటేష్ కాదన్న ఆ కథతో రవితేజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.