ఒక్క సినిమాతో స్టార్స్ క్యూ కడుతున్నారు..!

రీసెంట్ గా కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖైది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఖైది సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఖైది తర్వాత విజయ్ 64వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు లోకేష్. సూర్య కూడా లోకేష్ తో సినిమాకు రెడీ అని చెప్పాడట.  

ఇక లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ తో కమల్ కూడా సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. కమల్ తన నిర్మాణంలోనే లోకేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సినిమా తర్వాత దాదాపుగా కమల్ సినిమానే చేసే అవకాశం ఉందని అంటున్నారు. మానగరంతో ప్రతిభ చాటిన లోకేష్ ఖైదితో అదరగొట్టే హిట్ అందుకున్నాడు. ఖైది కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అవడంతో అతని కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు.