
ప్రముఖ రచయిత, నటుడు గొల్లపుడి మారుతిరావు అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గొల్లపుడి మారుతిరావుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి గొల్లపుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గొల్లపుడి మారుతిరావు తిరిగి మళ్లీ కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా.. నటుడిగా.. ఎన్నో విభిన్న పాత్రలను సృష్టించి.. నటించి ప్రేక్షకులను మెప్పించిన గొల్లపుడి మారుతిరావుకి తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.