
పెళ్లిచూపులతో హీరోయిన్ గా తన ప్రతిభ చాటుకున్న రీతు వర్మ ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ ను దక్కించుకోలేదు. నిఖిల్ తో కేశవ సినిమా తర్వాత పెద్దగా ఛాన్సులు అందుకోని రీతు వర్మ లేటెస్ట్ గా ఓ లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. యువ హీరో నాగ శౌర్య సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తెలుస్తుంది.
టాలెంటెడ్ హీరోయిన్ అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. నాగ శౌర్య సినిమాతో మళ్లీ ఆమె లైం లైట్ లోకి రావాలని చూస్తుంది. సుబ్రహ్మణ్యపురం సినిమాతో మెప్పించిన డైరక్టర్ సంతోష్.. నాగ శౌర్యతో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య అశ్వద్ధామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంతోష్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.