రెమ్యునరేషన్ లేకుండానే

హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారి ఆ క్రేజ్ తో మళ్లీ హీరోగా మారిన గోపిచంద్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. అతను ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంది. సినిమాకు సరైన బజ్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాడు గోపిచంద్. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.    

ఈ సినిమాకు గోపిచంద్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడట. సినిమా బిజినెస్ అయిన దాన్నిబట్టి అప్పుడు షేర్ తీసుకుంటాడని తెలుస్తుంది. ఈ సినిమతో సంపత్ నంది కూడా ఎలాగైనా హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నాడు. ఆల్రెడీ సంపత్ నందితో గోపిచంద్ గౌతం నంద సినిమా చేశాడు. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. మరి ఈసారి అయిన అంచనాలను అందుకునే సినిమా చేస్తారో లేదో చూడాలి.