
ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తారని ఎవరు ఊహించి ఉండరు. అయితే అలాని అసాధ్యమైన కాంబినేషన్ ను సుసాధ్యం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఆ సినిమా అంచనాలను అందుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కూడా 400 కోట్ల బడ్జెట్ తో వస్తుంది.
ఈ సినిమాకు మాటలను అందిస్తున్న సాయి మాధవ్ బుర్ర ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో తారక్, చరణ్ ఇద్దరు ఉన్నా ఈ ఇద్దరిని మించేలా కథ హైలెట్ గా ఉంటుందని. రాజమౌళితో పనిచేయడం కష్టమని అనుకున్నా కాని ఆయన తన పనిని చాలా సులభం చేస్తున్నారు. డైలాగ్ ఎంతవరకు కావాలి.. ఎలా కావాలి అన్నది ఆయన చెబుతారు దాన్నిబట్టి తాను రాసుకుంటూ వెళ్తానని అన్నారు సాయి మాధవ్ బుర్ర. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ మరో అద్భుతమైన సినిమా అవుతుందని అన్నారు.