
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వాలని చూశాడు. జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమా నిర్మిస్తారట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్దె వరుస స్టార్ అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్ గా గద్దలకొండ గణేష్ తో హిట్ అందుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు పవన్ ఛాన్స్ కూడా అందుకుని పూజా హెగ్దె సత్తా చాటుతుంది. చూస్తుంటే పూజా టాలీవుడ్ టాప్ పొజిషన్ లో నిలిచేలా ఉందని అంటున్నారు.