
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ షీల్డ్ అందుకున్నాడు. ముందునుండి అసలు ఏమాత్రం టైటిల్ రేసులో లేని రాహుల్ సడెన్ గా ప్రేక్షకుల అభిమానంతో విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో మొదటి నుండి వరుణ్, శ్రీముఖి టైటిల్ రేసులో ఉండగా వారిద్దరికి కాకుండా రాహుల్ ను విజేతగా గెలిపించారు.
అయితే గెలిచిన రాహుల్ కు 50 లక్షల ప్రైజ్ మనీ అందించారు. అయితే గెలిచిన రాహుల్ కన్నా హౌజ్ లో టాప్ 2గా ఉన్న రాహుల్, టాప్ 4లో ఉన్న వరుణ్ సందేష్ లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బయట వీరిద్దరికి మంచి క్రేజ్ ఉంది. హౌజ్ లో వీరు 105 రోజులు ఉన్నారు కాబట్టి వీరిద్దరి రెమ్యునరేషన్ గా కోటి దాకా అందుతున్నాయని తెలుస్తుంది. అంటే గెలిచిన రాహుల్ కన్నా శ్రీముఖి, వరుణ్ లకే రెమ్యునరేషన్ గా కోటి వచ్చాయన్నమాట. అయితే రాహుల్ కు తన రేంజ్ కు తగినట్టుగా వారానికి ఇచ్చే ఎమౌంట్ అడిషనల్ అని తెలుస్తుంది. నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది.