అసుర రీమేక్ డైరక్టర్ ఫిక్సా..?

కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించి రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా అసురన్. వెట్రిమారన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళంలో వసూళ్ల బీభత్సం సృష్టించింది. మాస్ లుక్ లో ధనుష్ మరోసారి తన సత్తా చూపించాడు. తమిళంలో హిట్టైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. సురేష్ బాబు ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేశారట. తెలుగులో కళైపుళి ఎస్ థాను, సురేష్ బాబు ఇద్దరు కలిసి ఈ సినిమా నిర్మిస్తారట.

అసురన్ తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఓంకార్ డైరెక్ట్ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. రాజు గారి గది సీరీస్ లను చేస్తున్న ఓంకార్ బయట సినిమాలు చేస్తాడా అన్నది డౌటే కాని సూపర్ హిట్ మూవీ రీమేక్ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వడని అంటున్నారు. ఓంకార్ డైరక్షన్ లో అసురన్ రీమేక్ అన్నది కేవలం రూమరా లేదా అన్నది చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తే తెలుస్తుంది.