
నాచురల్ స్టార్ నాని ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ లో దిగుతున్నారు. అయితే ఒకేరోజు వారి సినిమాలు రిలీజ్ కావట్లేదు కాని ఒక వారం గ్యాప్ తో ఈ ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయి. నాని ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న 'వి' సినిమా మార్చి 25 ఉగాది రోజుల రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో సుధీర్ బాబు కూడా ఒక హీరోగా చేస్తున్నాడు.
ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేస్తున్న మరో క్రేజీ మూవీ రెడ్. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడమ్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే మొదలైంది. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. మార్చి 25న నాని ఆ తర్వాత వారంలో రామ్ ఇలా ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాలని చూస్తున్నారు. నాని సినిమా సరిగా పరీక్షలు మిగిసే సమయానికి వస్తుంటే రామ్ సినిమా హాలీడేస్ స్టార్టింగ్ లో వస్తుంది.