స్టార్ ప్రొడ్యూసర్ టిక్ టాక్ ఫ్యాన్ అట..!

మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం లతో పాటుగా ఈమధ్య బాగా ఫేమస్ అయిన టిక్ టాక్ కు ఆయన పెద్ద ఫ్యాన్ అని తెలుస్తుంది. ఖాళీగా ఉన్న టైంలో అల్లు అరవింద్ ఎక్కువగా టిక్ టాక్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడట. అందులో వారు చేసే వీడియోలతో రోజులో ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ తమ ప్రతిభ కనబరుస్తారు.

టిక్ టాక్ లో వారి టాలెంట్ చూసి అల్లు అరవింద్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు తనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుని వారికి సినిమా ఛాన్స్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో మృణాళిని టిక్ టాక్ ద్వారానే హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. మరి అల్లు అరవింద్ కూడా అలానే తన సినిమాలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.