నాని సమంత జోడీ

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు కూడా ఈ మూవీలో మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాని మరోసారి శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే సినిమాలో నానికి జతగా అక్కినేని కోడలు సమంత నటిస్తుందట. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్ కెరియర్ కు బ్రేక్ పడుతుంది. కాని సమంత విషయంలో పెళ్లి తర్వాత మరింత జోష్ లో దూసుకెళ్తుంది. నాని, సమంతలు ఆల్రెడీ ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన మజిలీ సినిమాతో సమంత కూడా హిట్ అందుకుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.