
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. 15 మంది కంటెస్టంట్స్, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఇలా 17 మంది ఇంటి సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ 2గా శ్రీముఖి, రాహుల్ నిలిచారు. అయితే శ్రీముఖికి కన్నా రాహుల్ కి ఎక్కువ ఓట్లు రావడంతో టైటిల్ విజేతగా రాహుల్ ను ప్రకటించారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్ గెస్ట్ గా వచ్చారు.
చిరు చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ టైటిల్ షీల్డ్ అందుకున్నారు. మొదట్లో రాహుల్ ఆటతీరుని చూసిన వారు అత్నే బిగ్ బాస్ 3 విన్నర్ అవుతాడని అనుకుని ఉండరు. టాస్కులు టైట్ అవుతున్నా కొద్దీ అతను వేసిన స్టెప్పులు.. తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. సింగర్ గా అందరికి తెలిసిన రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ గా రాహుల్ మునుపటి కన్నా డబుల్ క్రేజ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.