
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడన్న వార్తలు తెలిసిందే. జనసేన అధినేతగా ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడని టాక్. అయితే అదే విషయాన్ని ఇప్పుడు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. 2016లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్ చేశారు. బోనీ కపూర్ నిర్మాతగా అజిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ కూడా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు పింక్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.