
యువ హీరో నాగ శౌర్యకు ఎంతో టాలెంట్ ఉన్నా సరే అన్ని సినిమాలకు తనకు లక్ కలిసి రావట్లేదు. ఒక హిట్టు రెండు ఫ్లాపులు అంద చందంగా నాగ శౌర్య కెరియర్ సాగుతుంది. ప్రస్తుతం అశ్వద్ధామ సినిమా చేస్తున్న నాగ శౌర్య ఆ సినిమా కోసం బాడీ ఫిట్ గా ఉంచుకుంటున్నాడు. లేటెస్ట్ గా తన జిమ్ బాడీతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు నాగ శౌర్య. కండలు తిరిగే దేహంతో నాగ శౌర్య ఇన్ స్టాగ్రాం లో పిక్ షేర్ చేశాడు.
జిమ్ చేస్తున్న టైంలో తన తండ్రి సలహా మేరకు ఈ పిక్ షేర్ చేసినట్టు చెప్పాడు. కనీసం క్యాప్షన్ పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదని చెప్పాడు నాగ శౌర్య. అయితే ఈ పిక్ చూసిన అక్కినేని కోడలు సమంత వెంటనే రిప్లై ఇచ్చింది. ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్ అంటూ నవ్వుతున్న ఎం.ఓ.జిని షేర్ చేసింది. సమంత, నాగ శౌర్య కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. సినిమా షూటింగ్ టైంలో నాగ శౌర్యతో సమంత ఫ్రెండ్ షిప్ బలపడ్డదని తెలుస్తుంది.