అక్కినేని అమల రీ ఎంట్రీ..!

హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన అక్కినేని అమల మళ్లీ సినిమల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమల ఏడేళ్ల క్రితం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత ఇక సినిమాల్లో కొనసాగిస్తారని అనుకున్నా మళ్లీ కనిపించలేదు. అయితే అమల అక్కినేని లేటెస్ట్ గా ఒక సినిమాకు సైన్ చేయడం విశేషం.

ఈసారి కూడా హీరో తల్లి పాత్రలో ఆమె కనిపించనున్నారు. యువ హీరో శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో శర్వానంద్ తల్లిగా అమల నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్న శర్వానంద్ ఆ సినిమాతో పాటుగా ఈ క్రేజీ మూవీతో కూడా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.