
సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ దశాబ్ధ కాలం పైగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ రేంజ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన కాజల్ ఈమధ్య యువ హీరోలతో కూడా జోడీ కడుతుంది. అయితే సీనియర్ స్టార్ హీరోలకు ఇప్పుడు కాజల్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 సినిమాలో చిరుకి జోడీగా కాజల్ నటించింది. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2లో కూడా ఆమె ఛాన్స్ అందుకుంది. ఇదిలాఉంటే ఈమధ్య అమ్మడికి పెళ్లి గాలి వీచినట్టు ఉంది. అందుకే పెళ్లి గురించి అడిగితే సిగ్గు పడుతూ సమాధానం ఇస్తుంది. అయితే కోలీవుడ్ మీడియాలో మాత్రం కాజల్ ఓ బిజినెస్ మ్యాన్ లవ్ లో ఉందని.. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నాక ఆమె పెళ్లి ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియదు కాని కాజల్ మాత్రం ఈ విషయం గురించి నోరు విప్పడం లేదు. మరి ఒకేసారి సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.