బాలయ్యతో కన్నడ బ్యూటీ..!

సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ కరువవుతున్న ఇలాంటి టైంలో ఉన్న వాళ్లనే రిపీట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్, బాలకృష్ణలకు హీరోయిన్స్ సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. చిరంజీవి, నాగార్జునలకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా వారు ఎంచుకునే కథలను బట్టి హీరోయిన్స్ సెట్ అవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెంకటేష్ వెంకీమామ సినిమాలో జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది.  

ఇక బాలకృష్ణ నెక్స్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను సినిమాకు హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కన్నడలో టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న శ్రద్ధ శ్రీనాథ్. తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రతిభ చాటుకుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందట. అందుకే శ్రద్ధ శ్రీనాథ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రద్ధా శ్రీనాథ్ బాలకృష్ణ సినిమాలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 2020 ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.