ఈషా రెబ్బాకు మెగా ఛాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కాకుండా ఓ స్పెషల్ రోల్ లో తెలుగు హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్నారట. 

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావంటూ వచ్చే వార్తలను బ్రేక్ చేస్తూ వరుస సినిమాలు చేస్తుంది ఈషా రెబ్బ. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ గా క్లిక్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాగల 24 గంటలలో సినిమాలో నటించిన ఈషా రెబ్బ మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబో మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ కు సెలెక్ట్ అయ్యిందట. ఈషా రెబ్బకు నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి మెగా మూవీ తర్వాత అమ్మడి కెరియర్ ఏవిధంగా టర్న్ అవుతుందో చూడాలి.