బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్.. హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్..!

నవంబర్ 3న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది.. ఆరోజు టైటిల్ విజేతను ఎనౌన్స్ చేస్తారు. వారికి ఇవ్వాల్సిన క్యాష్ ప్రైజ్ తో పాటుగా టైటిల్ షీల్డ్ కూడా ఇచ్చేస్తారు. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు కావాల్సినంత గ్లామర్ టచ్ ఇస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అందుకే ఆ రోజు స్పెషల్ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ లో అందాల భామల ఆట పాటలు ఉంటాయట. 

అవును బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు నిధి అగర్వాల్, అంజలితో పాటుగా మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు సర్ ప్రైజ్ గెస్ట్ వస్తాడని వార్తలు వచ్చాయి. కాని హోస్ట్ నాగార్జుననే టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది. రాహుల్, శ్రీముఖిలలో ఒకరు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.