రంగస్థలం రీమేక్.. లారెన్స్ ఏం చేస్తాడో..!

డ్యాన్స్ మాస్టర్ గా కెరియర్ ప్రారంభించి హీరో కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్న లారెన్స్ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. కొన్నాళ్లుగా కాంచనా సీక్వెన్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ తెలుగులో సూపర్ హిట్టైన రంగస్థలం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నుండి రంగస్థలం సినిమాను 1.5 కోట్లకు కొనేశాడట. తమిళంలో ఈ సినిమాను అతనే హీరోగా చేసే ఆలోచనలో ఉన్నాడట.   

అయితే తమిళ రంగస్థలం సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. లింగుసామి అయితే ఇలాంటి సినిమాలు బాగా డీల్ చేస్తాడని అతనితో చర్చలు చేసే ఆలోచనలో ఉన్నాడట లారెన్స్. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ లోనే కాదు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సినిమా రంగస్థలం. మరి లారెన్స్ చేస్తున్న ఈ రీమేక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.