
గద్దలకొండ గణేష్ హిట్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్పెషల్ గా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియరా అద్వాని బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
అక్కడ సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా కుర్రాళ్లని నిద్ర పట్టకుండా చేస్తుంది కియరా అద్వాని. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ తో హిట్ అందుకున్న కియరా అక్కడ వరుస ఛాన్సులు అందుకుంటుంది. అయితే వరుణ్ తేజ్ ఛాన్స్ వచ్చినా సరే కియరా ఓకే అఏ అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. కియరా కాదని చెబితే తెలుగులో ఫాంలో ఉన్న మరో హీరోయిన్ కు ఆ ఛాన్స్ ఇస్తారట.