వాళ్లపై నమ్మకం ఉంది.. రిస్క్ అనిపించలేదు..!

ఎవడే సుబ్రహ్మణ్యంలో సపోర్టింగ్ రోల్ చేసి పెళ్లిచూపులు టూ డియర్ కామ్రేడ్ చేసిన సినిమా 10 సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. దేవరకొండ విజయ్ ఒక పేరు కాదు అదొక బ్రాండ్ అనేలా తన కెరియర్ సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఓ పక్క హీరోగా చేస్తూ నిర్మాతగా కూడా మారాడు. విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన సినిమా మీకు మాత్రమే చెప్తా.

ఈ సినిమాను షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేశారు. హీరోగా చేసుకోవచ్చుగా ఈ నిర్మాతగా ఎందుకు రిస్క్ అని తన తండ్రి అన్నాడట. కాని ఈ టీం అందరిపై తనకు నమ్మకం ఉందని అందుకే నిర్మించడం రిస్క్ అనిపించలేదని చెప్పాడట. అదే మాట ఇంటర్వ్యూలో కూడా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. తన మీద నమ్మకంతో సినిమా తీశారు లేకుంటే తను ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉండే వాడిని అని అంటున్నాడు విజయ్ దేవరకొండ.