
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ను సినిమాల నుండి బహిష్కరించాలని కర్ణాటక సినిమా పరిశ్రమలో ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వొద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదికకు సంబందించిన సభ్యులు ఫిర్యాదు చేసింది. ప్రకాశ్ రాజ్ రామాయణాన్ని అవమానిస్తున్నారని.. హిందువుల మనోభవాలు దెబ్బతీసేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిల్మ్ చాంబర్ కు ఇచ్చిన లేఖలో రాసుకొచ్చారు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఆయన్ను బహిష్కరించాలని.. కన్నడ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కు అవకాశం కల్పించరాదని ఒకవేళ కాదు కూడదని ఇస్తే తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మునుముందు పోరాటాన్ని ఉదృతం చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కన్నడలో ఆయన్ను బహిష్కరిస్తే తెలుగు, తమిళ భాషల్లో కూడా అలాంటి ఫిర్యాదులే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.