
కోలీవుడ్ హీరో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో లాస్ట్ ఫ్రైడే రిలీజైన సినిమా ఖైది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ సినిమా అక్కడ ఇక్కడ రెండు చోట్ల హిట్టు కొట్టింది. ఓ పక్క పోటీగా విజయ్ విజిల్ సినిమా వచ్చినా సరే డిఫరెంట్ కథ కథనాలు ఉండటం వల్ల ఖైది సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఓటు వేశారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో తెలుగు ప్రేక్షకులందరికి తన ధన్యవాదాలు తెలియచేశాడు కార్తి.
అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో కార్తి రవితేజ తనకు ఫోన్ చేసిన విషయాన్ని చెప్పారు. ఖైది సినిమా చూసిన రవితేజకు ఈ సినిమా తనకు బాగా నచ్చిందని.. తను కూడా ఇలాంటి సినిమా చేస్తే నువ్వు తప్పకుండా చూడాలని అన్నాడట. కార్తి తప్పకుండా సార్ అని చెప్పాడట. సో రొటీన్ కథలతో విసుగెత్తిన రవితేజ ఖైది లాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. మరి రవితేజకు అలాంటి కథను ఎవరు చెబుతారో చూడాలి.