
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ కన్ఫాం అయినట్టే అని చెప్పొచ్చు. ఆల్రెడీ క్రిష్ చెప్పిన కథకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరాం డైరక్షన్ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాకు త్రివిక్రక్ కూడా తన సపోర్ట్ చేస్తున్నారట.
సినిమాకు మాటలు త్రివిక్రం రాస్తాడని తెలుస్తుంది. త్రివిక్రం, పవన్ కాంబినేషన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజ్ఞాతవాసి తప్ప మిగతా రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పవన్ పింక్ రీమేక్ కు త్రివిక్రం డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. అయితే ముందు క్రిష్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది షూటింగ్ ముగింపుదశలో ఉన్నప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తారట. వేణు శ్రీరాం అల్లు అర్జున్ తో చేయాల్సిన ఐకాన్ మూవీ క్యాన్సిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.