సాయి పల్లవితో నాగ చైతన్య 'లవ్ స్టోరీ'

మజిలీ సూపర్ హిట్ అవడంతో నాగ చైతన్య మళ్లీ ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకటేష్ తో వెంకీమామ సినిమా చేస్తున్న నాగ చైతన్య ఆ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల సాయి పల్లవిల కాంబోలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా లవ్ స్టోరీ అని పెడుతున్నారట.

టైటిల్ లోనే లవ్ స్టోరీ అని పెట్టాడంటే శేఖర్ కమ్ముల మరోసారి హృదయాలను తాకే ప్రేమకథతో వస్తున్నాడని చెప్పొచ్చు. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.