.jpeg)
స్టార్ తనయురాలిగా తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. మైఖేల్ తో ప్రేమాయణం నడిపించిన శృతి ఇద్దరు నేడో రేపో పెళ్లన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కాని సడన్ గా ఏమైందో ఏమో కాని ఎవరి దారి వారు చూసుకున్నారు.
ప్రస్తుతం తన స్టేటస్ సోలో అంటూ చెబుతున్న శృతి హాసన్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. అందుకే తెలుగు తమిళ భాషల దర్శక నిర్మాతలకు టచ్ లోకి వచ్చింది. ఇదిలాఉంటే తెలుగులో అప్పుడే అమ్మడికి ఒక ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ ను సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ గోపీచంద్, రవితేజ కాంబోలో బలుపు సినిమా వచ్చింది. ఆ సినిమా లో కూడా శృతి హాసన్ నటించింది. మరి రీ ఎంట్రీ తర్వాత అయినా శృతి వరుస సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.