సుకుమార్ నుండి మరో రంగస్థలం

రంగస్థలం సినిమాతో దర్శకుడిగా ఒక రేంజ్ కు వెళ్లిన సుకుమార్ ఆ సినిమాతో తన సత్తా చాటాడు. రంగస్థలం తర్వాత అసలైతే మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది కుదరలేదు. మహేష్ సినిమా మిస్సైనా అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు సుక్కు.  ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తుందట. 

అయితే ఈ మూవీ కూడా రంగస్థలం లానే పిరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. సినిమాలో బన్నీ ఎక్కువగా బనియన్,  లుంగి తోనే కనిపిస్తాడట. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న అల వైకుంఠపురములో రిలీజ్ తర్వాత మొదలవుతుందని తెలుస్తుంది.