.jpeg)
ఈ ఇయర్ f-2 హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న వెంకటేష్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ మూవీ తర్వాత తన 74 వ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో వెంకటేష్ నటిస్తాడని తెలుస్తుంది. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా సెన్సేషల్ హిట్ అయ్యింది.
ఇక కెరియర్ లో 75వ సినిమా మైల్ స్టోన్ మూవీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అందుకే ఆ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కు సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్టర్ గా మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా చేయలేదు. మరి వెంకీ 75 వ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.