
మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి ఓ ఫోటో దిగి చాలా రోజులైంది. జనసేన అధినేతగా పవన్ ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటూ బిజీగా ఉంటున్నాడు. మరో పక్క పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీతో పవన్ కలిసిన సందర్భాలు చాలా తక్కువ.
తన భార్య అన్నా లెజినోవాతో దీపావళి సమబరాలు చిరు ఇంట్లో జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. చరణ్ ఆహ్వానం మేరకు పవన్ సకుటుంబ సపరివార సమేతంగా దీపావళి స్పెషల్ పార్టీకి వచ్చాడట. అన్నా లెజినోవా పిల్లలతో పాటుగా అకిరా నందన్, ఆద్యలు కూడా ఈ పార్టీకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతుంది. ముగ్గురు కొడుకుల మధ్యలో అంజనా దేవి కూర్చుని ఉన్నారు. మెగా ఫ్యాన్స్ కు పండుగ సంతోషాన్ని డబుల్ చేసేలా ఈ పిక్ ఉంది.