బిగ్ బాస్ ఫైనల్స్.. మెగాస్టార్ గెస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ వీక్ కు చేరుకుంది. ప్రస్తుతం టాప్ 5లో శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలి, బాబా భాస్కర్ ఉన్నారు. టైటిల్ గెలిచేది ఒక్కరే.. ఈ వారం టాప్ 5 మెంబర్స్ ఆడే ఆటతో పాటుగా ఆడియెన్స్ వేసే ఓట్ల ద్వారా టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలుస్తుంది. ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తెలుస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ కు చిరు గెస్ట్ గా వస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది.  

సైరా సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య ప్రతి ఈవెంట్ కు అటెండ్ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశారు. ఫైనల్ ఎపిసోడ్ లో విజేతను ఆయనే ఎనౌన్స్ చేశారు. ఇక సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు. అయితే వెంకటేష్ గెస్ట్ గా వచ్చి విన్నర్ ను ఎనౌన్స్ చేశారు. ఈసారి కూడా నాగార్జునతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్, శ్రీముఖి, వరుణ్ ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందట.