రామ్ రెడ్.. రఫ్ అండ్ టఫ్..!

ఇస్మార్ట్ శంకర్ తో మాసివ్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. సరైన సినిమా పడితే తన స్టామినా ఏంటి అన్నది ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఇస్మార్ట్ హిట్ రామ్ కెరియర్ లో కొత్త జోష్ తెచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో తన తర్వాత సినిమా చేస్తున్నాడు రామ్. తనతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన కిశోర్ తిరుమల డైరక్షన్ లో రామ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా రెడ్ అని ఫిక్స్ చేశారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిశోర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.          

అయితే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో రామ్ షాక్ ఇచ్చాడు. మరోసారి రామ్ తన మాస్ లుక్ తో ఫ్యాన్స్ ను అలరించనున్నాడని తెలుస్తుంది. రఫ్ అండ్ టఫ్ లుక్ తో వెనక్కి తిరిగి చూస్తున్న రామ్ మాస్ లుక్ మరోసారి మాస్ ఆడియెన్స్ కు భలే నచ్చేసింది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి.. ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు సున్నితమైన భావోద్వేగాలతో తీసిన కిశోర్ తిరుమల రెడ్ అంటూ కెరియర్ లో మొదటిసారి మాస్ మూవీ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.