అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.    

హీరో, విలన్ అనే తేడా లేకుండా తమిళ ఆడియెన్స్ ను అలరిస్తున్న విజయ్ సేతుపతి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.     

సుకుమార్ మహేష్ కోసం రాసిన కథతోనే బన్ని సినిమా తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అల వకుంఠపురములో రిలీజ్ అవగానే ఏమాత్రం లేట్ చేయకుండా సుక్కు సినిమా చేస్తాడట బన్ని. ఆ తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు.