మరోసారి 'మిర్చి' కాంబినేషన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మిర్చి. అప్పటివరకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ మొదటి డైరక్షనల్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాతో ప్రభాస్ కు సూపర్ హిట్ ఇచ్చాడు కొరటాల శివ. ఆ తర్వాత కొరటాల శివ వరుస విజయాల పరంపర గురించి తెలిసిందే. ఇక ప్రభాస్ విషయానికొస్తే మిర్చి తర్వాత బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.  

ఇక లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం మరోసారి మిర్చి కాంబినేషన్ లో సినిమా రాబోతుందట. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. నవంబర్ నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ప్రభాస్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. ప్రభాస్ కూడా జిల్ ఫ్రేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మిర్చి కాంబో సినిమాపై మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.