శివ జ్యోతి బయటకు వచ్చింది.. ఫైనల్ విన్నర్ ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ వీక్ లోకి వచ్చింది. చివరి ఎలిమినేటర్ గా శివ జ్యోతి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ లో రాహుల్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉండగా ఆ తర్వాత బాబా భాస్కర్ టికెట్ టు ఫినాలేకి రాగా.. శనివారం ఎపిసోడ్ లో శ్రీముఖిని సేవ్ చేశాడు నాగార్జున. ఇక ఆదివారం ఎపిసోడ్ లో వరుణ్, అలి, శివ జ్యోతిలలో వరుణ్ ను ముందు సేవ్ చేశాడు. మిగిలిన అలి, శివ జ్యోతి ఇద్దరిలో అలిన్ సేఫ్ చేసి శివ జ్యోతిని ఎలిమినేట్ అని ప్రకటించారు. 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో టాప్ 5 లో శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా, భాస్కర్, అలి ఉన్నారు. వీరిలో ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు.. టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఎక్సైటింగ్ గా మారింది. రాహుల్ కు బయట ఫాలోయింగ్ ఎక్కువగా ఉండగా అతనే విన్నర్ అనే టాక్ వస్తుంది. అయితే శ్రీముఖికి కూడా టైటిల్ విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. రెండు వారాల ముందు వరకు వరుణ్ టాప్ 1 అని అందరు అన్నారు. కాని వితిక ఎలిమినేట్ అయ్యాక అతను కాస్త వెనక్కి తగ్గాడు. అయినా సరే టైటిల్ గెలుచుకునే వారిలో వరుణ్ కూడా ఉన్నాడు. మరి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.