
ప్రస్తుతం టాలీవుడ్ లో మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని చెప్పొచ్చు. కన్నడ నుండి వచ్చిన ఈ భామ తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఛలో, గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ తీసిన ఈ నాలుగు సినిమాలతోనే సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈమధ్య రష్మిక రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుందని వార్తలు వచ్చాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా ఆఫర్ కూడా కాదన్నదన్న న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తలు రష్మిక దాకా వెళ్లాయి అనుకుంటా అందుకే రష్మిక రూమర్లను తిప్పికొట్టింది. డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా పరిశ్రమలో ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నిర్మాతలకు తెలుసని.. తాము డిమాండ్ చేసినంత మాత్రాన అడిగినంత ఇవ్వరని అంటుంది రష్మిక. తను కేవలం డేట్స్ ఖాళీ లేకనో స్టోరీ నచ్చకనే సినిమాలు వదులుకున్నా తప్ప రెమ్యునరేషన్ గురించి ఏ సినిమా వదులుకోలేదని చెప్పింది.