
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే. సినిమా నుండి మొదటి సాంగ్ సామజవరగమన సూపర్ హిట్ అవగా ఇప్పుడు అల వైకుంఠపురములో నుండి సెకండ్ సాంగ్ రాములో రాములా సాంగ్ రిలీజైంది. రీసెంట్ గా ఈ సాంగ్ ప్రోమో అలరించగా దీపావళి సందర్భంగా రాములో రాములా ఫుల్ సాంగ్ రిలీజైంది.
పార్టీ సాంగ్ లా అనిపిస్తున్న ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ని, మంగ్లీ పాడటం విశేషం. ఈ సాంగ్ లో సినిమాలో నటించే నటీనటులంతా ఉన్నట్టు కనిపిస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, సునీల్ నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. తన సెకండ్ సాంగ్ తో కూడా సినిమాపై అంచనాలు పెంచారు. సాంగ్స్ సూపర్ హిట్ అవగా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది.