
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సి.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ సినిమా టైటిల్ రూలర్ అని పెట్టారు. జై సింహా తర్వాత బాలకృష్ణ, రవికుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
సినిమాలో బాలయ్య బాబు పవర్ ఫుల్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. దీవాళి కానుకగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. 2020 సంక్రాంతి బరిలో బాలకృష్ణ వస్తాడని అనుకోగా సడెన్ గా డిసెంబర్ 20న రూలర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. ఆల్రెడీ డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే, రవితేజ డిస్కో రాజా, అనుష్క నిశ్శబ్ధం సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేశారు. మరి బాలయ్య రూలర్ కూడా ఆరోజు రిలీజ్ అవడంతో క్రిస్ మస్ రేసు మరింత రసవత్తరంగా మారనుంది.