అనసూయ.. అసూయ కలిగించేలా..!

చేసేది యాంకరింగే కాని అనసూయలో దానిలో సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా గ్లామర్ ను అద్ది అదరగొడుతుంది. జబర్దస్త్ షో అంత పెద్ద హిట్ అవడంలో అనసూయ అందాల ప్రదర్శన కూడా ఓ కారణమని చెప్పొచ్చు. బుల్లితెర మీదే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన ప్రతాపం చూపిస్తుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అందరి మనసులు గెలుచుకుంది. అటు సినిమాలతో పాటుగా ఇటు స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తున్న అనసూయ ఖాళీ దొరికితే ఫోటో షూట్స్ చేస్తుంది.   

లేటెస్ట్ గా అమ్మడు నైట్ మోడ్ లో చేసిన ఈ గ్లామర్ షో ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా సరే అనసూయ అలా కనిపించకుండా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. ఆమె ఫాలోవర్స్ ను ఎప్పుడు నిరాశ పరచని అనసూయ తన గ్లామర్ లుక్ తో ఈసారి మరింత క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. రీసెంట్ గా కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది. 

యాంకర్ గా మంచి ఫాంలో ఉన్న ఈ అమ్మడు సగటు హీరోయిన్స్ కు షాక్ ఇచ్చేలా తన గ్లామర్ షో చేస్తుంది. ఓ విధంగా అనసూయని చూసి వారికి అసూయ కలగడం ఖాయమని చెప్పొచ్చు.