
మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమా విజేత పెద్దగా అలరించలేదు అందుకే ఈసారి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకునేందుకు సూపర్ మచ్చి సినిమాతో వస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాకు పులి వాసు డైరక్షన్ చేస్తున్నారు. రిజ్వాన్ మూవీస్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దీవాళి కానుకగా రిలీజ్ చేశారు.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు మెగా ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అయితే ఎంత ఫ్యాన్స్ బేస్ ఉన్నా సరైన కంటెంట్ లేకుంటే చతికిల పడాల్సిందే. విజేతతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేని కళ్యాణ్ దేవ్ ఈసారి సూపర్ మచ్చితో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ చూస్తే కళ్యాణ్ నటనలో కూడా పరిణితి చెందినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.