సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి ఫస్ట్ లుక్..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా నుండి విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజైంది. లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2006 లో నాయుడమ్మ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.  

సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి భారతి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. చెయిర్ లో కూర్చుని ఎదుటి మనిషి చెబుతున్న లుక్ రిలీజ్ చేశారు. విజయశాంతి లుక్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆ పాత్ర చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆమె హీరోయిన్ గా నటించారు. మళ్లీ ఇప్పుడు మహేష్ హీరోగా సినిమాలో విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. విజయశాంతి ఫస్ట్ లుక్ తో ఆమె ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.