
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను చూసి వాళ్లు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు.. మన ఎప్పటిలానే మూస సినిమాలు చేస్తున్నామని అనుకునే వాళ్లం. కాని పరిస్థితులు మారాయి. హింది చిత్ర పరిశ్రమ సైతం టాలీవుడ్ మీద ఓ కన్నేసి ఉంచేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఏ ఇండియన్ సినిమా సృష్టించిన ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఈమధ్యనే రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది బాహుబలి.
కేవలం బాహుబలి మాత్రమే కాదు అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ హిట్టైన సినిమాలను హిందిలో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇయర్ నాని నటించిన జెర్సీని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు అదే దారిలో స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటించిన సూపర్ హిట్ మూవీ భాగమతిని కూడా హిందిలో రీమేక్ చేస్తున్నారట.
అయితే ఒకప్పుడు మన సినిమాలు రీమేక్ చేయాలంటే కేవలం రైట్స్ కొనేవారు.. కాని ఇప్పుడు మాత్రుక దర్శకుడితోనే అక్కడ సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే కబీర్ సింగ్ రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. జెర్సీ రీమేక్ కు గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడని అంటున్నారు. భాగమతి సినిమాను కూడా దర్శకుడు అశోక్ హిందిలో డైరెక్ట్ చేస్తాడని లేటెస్ట్ టాక్. అనుష్క పాత్రలో భూమి పడ్నేకర్ నటిస్తుందని తెలుస్తుంది. భాగమతి బాలీవుడ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.