అమలా పాల్ మళ్లీ ప్రేమ పెళ్లేనా..!

మళయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ హీరోయిన్ గా మంచి పీక్స్ లో ఉన్న టైంలోనే డైరక్టర్ విజయ్ తో ప్రేమ ఆ తర్వాత పెళ్లితో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రెండేళ్లు కాపురం చేశారో లేదో ఇక చాలు అనుకున్న వారిద్దరు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. సోలోగా ఉంటున్న అమలా తనకు ఇంతటి క్రేజ్ ఇచ్చిన సినిమాలను మళ్లీ కొనసాగించాలని అనుకుంది. 

అనుకోవడమే ఆలస్యం అమ్మడికి వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి.. రీ ఎంట్రీ తర్వాత అమలా మునుపటి కన్నా మరింత రెచ్చిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. కన్నడలో ఛాన్సులు అందుకుంటున్న అమలా పాల్ తెలుగు తమిళ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు మళ్లీ ప్రేమలో పడటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ పెళ్లే అంటుంది అమలా. మరి ఒకసారి ఇలా ప్రేమ పెళ్లి తేడా కొట్టేసిందన్న ఆలోచన లేకుండా మళ్లీ అమ్మడు ప్రేమించి పెళ్లాడుతా అనడం షాక్ అయ్యేలా చేస్తుంది.   

అందం.. అభినయం రెండు సమపాళ్లలో ఉన్న అమలా పాల్ కెరియర్ మీద దృష్టి పెడితే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం. రీసెంట్ గా తమిళ, తెలుగు భాషల్లో ఆడై సినిమా చేసినా పెద్దగా ప్రయోజనం ఏమి లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు మూడు తమిళ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతుంది.